Monday, February 18, 2008

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి- వర్ధంతి

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి- 161వ వర్ధంతి(22.Feb.2008)




భారత మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.

భారత స్వాతంత్ర్య చరిత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి- మహోజ్వల శక్తి. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు.


బహిరంగ ఉరి-వీర మరణం: నరసింహారెడ్డిని, అతని అనుచరులను విచారించిన బ్రిటిషు ప్రభుత్వం అతనికి ఉరిశిక్షను, అనుచరులకు వివిధ ఇతర శిక్షలను విధించింది. ఈ బహిరంగ ఉరి కి రెండు వేల మంది ప్రజలు హాజరు అయ్యారు.

బ్రిటిషు ప్రభుత్వం, 22.ఫిబ్రవరి.1847, సొమవారం, ఉదయం 7 గంటలకు జుర్రేటి వడ్డున ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరితీసింది. ఉరి దృశ్యాన్ని చుసిన ప్రజలు, మౌనం గా రొదించారు.విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 వరకు కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.

Uyyalawada Narasimha Reddy: 161th Death Anniversary,22.Feb.2008, 7 AM

* We pray to God to rest Uyyalawada Narasimha Reddy's soul in peace.

1 comment:

Anonymous said...
This comment has been removed by the author.